భారత్ లో జరగనున్న వన్డే వరల్డ్ కప్ కి ఐసీసీ తాజాగా అంపైర్ల జాబితాని విడుదల చేసింది. అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీ కోసం 16 మంది అంపైర్లను ఎంపిక చేసింది. ఈ జాబితాలో భారత్ నుంచి నితిన్ మీనన్ ఒక్కడికే అవకాశం దక్కింది. రిఫరీల్లో కూడా భారత్ నుంచి జవగల్ శ్రీనాథ్ ఒక్కడినే ఎంపిక చేశారు.
తొలి మ్యాచుకు ఎవరంటే..?
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా తొలి మ్యాచులో ఇంగ్లాండ్, న్యూజిలాండ్ తలపడబోతున్నాయి. చివరి వన్డే వరల్డ్ కప్ లో ఈ రెండు జట్లు విన్నర్, రన్నరప్ నిలిచాయి. దీంతో వరల్డ్ కప్ ఎక్కడ ముగిసిందో అక్కడ నుంచే ప్రారంభించనున్నారు. అక్టోబర్ 5 న జరగనున్న ఈ మ్యాచుకు భారత అంపైర్ నితిన్ మీనన్, శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార ధర్మసేన ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరిస్తారని ఐసీసీ పేర్కొంది.
భారత్-పాక్ మ్యాచుకు అంపైర్లు ఫిక్స్
అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కు అంపైర్ల, రిఫరీల వివరాలను సైతం ఐసీసీ వెల్లడించింది. రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, మరియాస్ ఎరాస్మస్ ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరించనుండగా.. రిచర్డ్ కెటిల్‌బోరో థర్డ్ అంపైర్‌గా, ఆండీ పైక్రాఫ్ట్ మ్యాచ్ రిఫరీగా ఉంటారు. అక్టోబర్ 14 న గుజరాత్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.
అంపైర్ల వివరాలు..
- క్రిస్ బ్రౌన్ (న్యూజిలాండ్)
- కుమార ధర్మసేన (శ్రీలంక)
- మరియాస్ ఎరాస్మస్ (సౌతాఫ్రికా)
- క్రిస్టోఫర్ గఫ్ఫానీ (న్యూజిలాండ్)
- మైఖేల్ గాఫ్ (ఇంగ్లండ్)
- అడ్రియన్ హోల్డ్‌స్టాక్ (సౌతాఫ్రికా)
- రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ (ఇంగ్లండ్)
- రిచర్డ్ కెటిల్‌బోరో (ఇంగ్లండ్)
- నితిన్ మీనన్ (ఇండియా)
- ఎహసాన్ రజా (పాకిస్తాన్)
- పాల్ రీఫిల్ (ఆస్ట్రేలియా)
- షర్ఫుద్దౌలా ఇబ్నే షహీద్ (బంగ్లాదేశ్)
- రాడ్నీ టక్కర్ (ఆస్ట్రేలియా)
- అలెక్స్ వార్ఫ్ (ఇంగ్లండ్)
- జోయెల్ విల్సన్ (వెస్టిండీస్)
- పాల్ విల్సన్ (ఆస్ట్రేలియా)
- రిఫరీల జాబితా..
- జెఫ్ క్రో (న్యూజిలాండ్)
- ఆండీ పైక్రాఫ్ట్ (జింబాబ్వే)
- రిచీ రిచర్డ్‌సన్ (వెస్టిండీస్)
- జవగల్ శ్రీనాథ్ (ఇండియా)
Richard Illingworth and Marais Erasmus will be the on-field umpires for the India vs Pakistan match in Ahmedabad in this World Cup 2023. pic.twitter.com/J0IG1aLRdv
— CricketMAN2 (@ImTanujSingh) September 25, 2023