క్రికెట్ విజేతగా కుమార్ లెవెన్​ టీం

జైపూర్(భీమారం), వెలుగు: భీమారం మండల కేంద్రంలో పోతనపల్లి గ్రామానికి చెందిన ఉస్కమల్ల చిన్న పోచం స్మారక క్రికెట్ పోటీలు సోమవారం ముగిశాయి. ఆయన కుమారులు శ్రీనివాస్, పున్నం చందు, సాంబ శివ నిర్వహించిన పోటీల్లో 35 టీమ్​లు 15 రోజుల పాటు రసవత్తరంగా పోటీపడ్డాయి. సోమవారం జరిగిన ఫైనల్​లో కుమార్ లెవెన్, ఆర్ఎన్ఆర్ జట్లు పోటీపడగా కుమార్ లెవెన్ జట్టు విజయం సాధించింది. విన్నర్ కు రూ.15 వేలు, రన్నరప్ కు రూ.10 వేల చెక్కులను కాంగ్రెస్ సీనియర్ లీడర్ కేవీ.ప్రతాప్ అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ లీడర్లు పొడేటి రవి, భూక్య లక్ష్మణ్, గుండు తిరుపతి, మాజీ జడ్పీటీసీ రాజ్ కుమార్ నాయక్, మాజీ సర్పంచ్ రాంరెడ్డి, ఎడ్ల శ్రీనివాస్, సత్తి రెడ్డి, క్రీడాకారులు పాల్గొన్నారు.