రెండేళ్లలోనే మళ్లీ కుంభమేళా.. ఈ సారి ఎక్కడ.. ఎన్ని రోజులు.. ఏ తేదీల్లో..?

రెండేళ్లలోనే మళ్లీ కుంభమేళా.. ఈ సారి ఎక్కడ.. ఎన్ని రోజులు.. ఏ తేదీల్లో..?

మహా కుంభమేళా ముగిసింది.. 45 రోజుల మహా కుంభమేళాలో 70 కోట్ల మంది వరకు భక్తులు పుణ్య స్నానాలు చేశారు.. 77 దేశాలకు చెందిన 120 మంది ప్రతినిధులతోపాటు మన ప్రధాని మోదీ, రాష్ట్రాల సీఎంలు, సినిమా హీరోలు ఇలా ఎంతో మంది కుంభమేళాలో పవిత్ర స్నానాలు చేశారు.. 2025 మహా కుంభమేళా అయిపోయింది.. మరి నెక్ట్స్  కుంభమేళా ఎప్పుడు.. ఎక్కడ జరుగుతుంది అనేది చూద్దాం.. మరో రెండేళ్లల్లోనే 2027లోనే కుంభమేళా వస్తుంది.. ఇది ఎక్కడ.. ఎప్పుడు.. ఏ తేదీల్లో జరుగుతుందో తెలుసుకుందామా..

Also Read:-EPFO వడ్డీరేటు 8.25శాతం..EPFO ​బోర్డు ఆమోదం..

2027లో కుంభమేళా వస్తుంది. ఇది మహారాష్ట్ర నాసిక్ లో.. శివుడి జ్యోతిర్లింగాల్లో ఒకటి అయిన త్రయంభకేశ్వరానికి 40 కిలోమీటర్ల దూరంలోని నాసిక్ లో ఈ కుంభమేళా జరగబోతుంది. గోదావరి నదిలో కుంభమేళా నిర్వహించనున్నారు. దీని కోసం ఇప్పటి నుంచి మహా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అవుతుంది. ఏర్పాట్లకు సంబంధించి మొదటి సమావేశం కూడా జరిగిపోయింది. 

2027 సంవత్సరం జూలై 17 నుంచి ఆగస్ట్ 17వ తేదీ వరకు.. 30 రోజులు ఈ కుంభమేళా జరగనుంది. 

కుంభమేళాలు ఇలా జరుగుతాయి :

కుంభమేళాలు దేశంలో నాలుగు నగరాల్లోనే జరుగుతాయి. ప్రయాగరాజ్, హరిద్వార్, నాసిక్, ఉజ్జయిని. మూడేళ్లకు ఒకసారి.. ఒక్కోసారి ఒక్కో నగరంలో ఈ కుంభమేళా జరుగుతుంది. 
నాలుగేళ్లకు వచ్చే దాన్ని కుంభమేళా అంటారు. ఆరేళ్లకు జరిగే దాన్ని అర్థ కుంభమేళా అంటారు. 12 ఏళ్లకు జరిగే దాన్ని పూర్ణ కుంభమేళా అంటారు. 144 ఏళ్లకు జరిగే దాన్ని మహా కుంభమేళా అంటారు.