సమాచారం కోసం..కుంభమేళాలో ఎఫ్ ఎం రేడియో..కుంభ వాణి లాంచ్

  • సమాచార ప్రసారానికి ‘కుంభ వాణి’ ఎఫ్ఎం లాంచ్

ప్రయాగ్​రాజ్: కుంభ మేళా సమాచారం అందివ్వడం కోసం ప్రభుత్వం బ్రాడ్‌‌‌‌ కాస్టర్ ప్రసార భారతి రేడియో విభాగం ఆకాశవాణి ప్రత్యేకంగా ‘కుంభ వాణి’ ఎఫ్ఎం చానెల్ ప్రారంభించింది. 

103.5 మెగాహెర్జ్​ ఫ్రీక్వెన్సీలో ప్రసారమయ్యే ఈ చానెల్ జనవరి 10 నుంచి ఫిబ్రవరి 26 వరకు.. ప్రతిరోజూ ఉదయం 5.55 నుంచి రాత్రి 10.05 గంటల వరకు ప్రసారం అవుతుందని వివరించింది. 

ఈ కార్యక్రమంలో పాల్గొన్న యూపీ సీఎం యోగి మాట్లాడుతూ.. కుంభవాణి ఎఫ్ఎం చానెల్ కుంభమేళా రోజువారీ కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేయడంతోపాటు, మహాకుంభ్‌‌‌‌కు సంబంధించిన మతపరమైన అంశాలు, కథలను మారుమూల గ్రామాల్లోని ప్రజలకు చేరవేస్తుందన్నారు. 

అలాగే ఆధ్యాత్మిక సారాన్ని, కుంభమేళా స్ఫూర్తిని దేశవ్యాప్తంగా విస్తరిస్తుందని తెలిపారు. ‘‘ప్రస్తుతం ఎఫ్ఎం చానెల్‌‌‌‌లు యూత్​లో పాపులర్ అయ్యాయి. కుంభవాణి కూడా నిస్సందేహంగా మంచి ప్రచారం పొందుతుంది” అని యోగి అన్నారు. కార్యక్రమంలో కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ తదితరులు పాల్గొన్నారు.