
- మూడున్నర గంటలు లేటుగా బయలుదేరిన స్పైస్ జెట్ ఫ్లైట్
శంషాబాద్. వెలుగు: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కుంభమేళాకు బయలుదేరాల్సిన ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ఉత్తర్‌ప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా స్నానానికి మహాశివరాత్రి చివరి రోజు అని ప్రకటించడంతో సుమారు 190 మంది స్పైస్ జెట్‌లో హైదరాబాద్ నుంచి వారణాసికి టికెట్స్బుక్ చేసుకున్నారు. బుధవారం ఉదయం10 గంటలకు ఫ్లైట్ ఉండడంతో అందరూ 9 గంటల్లోపే చేరుకున్నారు. అయితే బోర్డింగ్అయిపోయిన తర్వాత కూడా విమానం రాలేదు. ఎలాంటిసమాచారం లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురయ్యారు.
మధ్యాహ్నం వరకు ఎదురుచూసినా అధికారులు ఏం జరుగుతుందో చెప్పలేదు. దీంతో ఎయిర్‌పోర్టులోనే నిరసనకు దిగారు. సాంకేతిక సమస్య కారణంగా ఆలస్యమవుతోందని స్పైస్ జెట్ యాజమాన్యం ప్రయాణికులకు సర్ది చెప్పే ప్రయత్నం చేసింది. ఈ విషయాన్ని ఇంత లేట్‌గా చెప్పడమేంటని ప్యాసింజర్లు మండిపడ్డారు. వెంటనే తమకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని డిమాండ్‌చేయడంతో చివరకు మధ్యాహ్నం 1 : 40 నిమిషాలకు విమానాన్ని సిద్ధం చేసి ప్రయాగ్ రాజ్ కు పంపించారు.