ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభ మేళా భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అని ప్రధాని మోదీ అన్నారు. ఇది అన్ని ప్రాంతాల, వర్గాల ప్రజలను ఒక్కతాటిపైకి తీసుకువచ్చిందని పేర్కొన్నారు. “మన్ కీ బాత్’లో భాగంగా పీఎం ప్రసంగిస్తూ ప్రపంచ దేశాల ప్రజలు ప్రయాగ్ రాజ్ వచ్చి వచ్చి పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారని తెలిపారు.
దేశంలోని యువత తమ ఆచార సంప్రదాయాలను తెలుసుకున్నప్పుడే మన మూలాలు బలపడతాయన్నారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రపంచ దేశాల నుంచి వస్తున్న ఆదరణ ప్రతి భారతీయుడికి గర్వకారణమని చెప్పారు.
ALSO READ | కుంభమేళాలో రోజూ లక్ష మందికి ఫ్రీ మీల్స్... ఇస్కాన్, అదానీ గ్రూప్ ఆధ్వర్యంలో ఏర్పాటు
సమాజంలో పరిస్థితులు మారిపోతున్నాయని.. దేశం డిజిటల్ యుగంలోకి ప్రవేశిస్తోందన్నా రు.. అభివృద్ధిలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని వెల్లడించారు.
ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహించే మన్ కీ బాత్.. ఈ సారి రిపబ్లిక్ డే సందర్భంగా 3వ ఆదివారం (19 జనవరి) నిర్వహించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు ముందస్తు గణతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జనవరి 23న నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి ఉన్నందున.. నేతాజీ జయంతి శుభాకాంక్షలె తెలియజేశారు.