భక్తులకు గుడ్ న్యూస్.. ఇంటికే కుంభమేళా జలాలు.. ఎలాగంటే..?

లక్నో: మహాకుంభ మేళా మొదలైంది. 12 ఏండ్లకు ఒక్కసారి వచ్చే ఈ పండుగ వేళలో త్రివేణి  సంగమ క్షేత్రమైన ప్రయాగ్ రాజ్‎లో పుణ్యస్నానాలు చేయాలని చాలా మంది కోరుకుంటారు. కుంభ స్నానం చేయడం వల్ల అనేక పాపాలు హరిస్తాయని  భక్తులు విశ్వసిస్తారు. అక్కడికి వెళ్లి స్నానం చేయలేని వారు త్రివేణి సంగమ జలాలతో పుణ్యస్నానాలు చేసి ఆ ఫలాన్ని పొందవచ్చని శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద చెప్పారు. రెండు, మూడు చుక్కల నీటిని ఇంట్లో స్నానం చేసే నీటిలో కలుకోవాలని అన్నారు. 

ALSO READ | మహా కుంభమేళా 2025 : 12 ఏండ్లకు ఒకసారే ఎందుకు..? సూర్య, చంద్రుడు ఒకే రాశిలోకి వచ్చినప్పుడే ఇలా..!

త్రివేణి  సంగమ జలాలను పలు  స్వచ్ఛంద సంస్థలు ఉచితంగా అందిస్తున్నాయి. పుణ్య స్నానం ఆచరించిన తర్వాత దాన ధర్మాలు చేయాలని అవిముక్తేశ్వరానంద సూచించారు. 'ది త్రివేణి సంగం వాటర్ డెలివరీ సర్వీస్' త్రివేణి నుండి నేరుగా నీటిని డెలివరీ చేస్తుంది. దీంతో పాటు ఫ్లిప్ కార్ట్‎లోనూ మహాకుంభ్ నీటి బాటిళ్లు అందుబాటులో ఉన్నాయి. కాకపోతే డెలివరీ చార్జీలు మాత్రం వసూలు చేస్తున్నారు.