భునాదిగాని కాల్వను పట్టించుకోలే : కుంభం అనిల్ కుమార్ రెడ్డి

యాదాద్రి, వెలుగు: గత ప్రభుత్వం భునాదిగాని కాల్వను పట్టించుకోలేదని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్​కుమార్​ రెడ్డి మండిపడ్డారు.  బీబీనగర్ మండలం మక్త అనంతారంలోని భునాదిగాని కాల్వను మంగళవారం పరిశీలించారు.  ఇరిగేషన్​ ఆఫీసర్లను అక్కడికి పిలిపించి కాల్వలోని గుర్రపు డెక్కను  తొలగించాలని ఆదేశించారు.  

మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి భునాదిగాని కాల్వ కోసం రూ. 90 కోట్లు మంజూరయ్యాయని చెప్పారే తప్ప నిధులను విడుదల చేయించలేదన్నారు. విడతల వారీగా రూ. 30 కోట్లు మంజూరైనా పనులు చేయలేదన్నారు.  అంతకు ముందు హైదరాబాద్​లో మంత్రి ఉత్తమ్​కుమార్​ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.  అనంతరం భువనగిరిలోని కాంగ్రెస్​ లీడర్​ పోతంశెట్టి చక్రపాణి ప్రథమ వర్ధంతిలో పాల్గొన్నారు.