హైదరాబాద్, వెలుగు : యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన కుంభం అనిల్ కుమార్ రెడ్డి మళ్లీ కాంగ్రెస్‌పార్టీలో చేరారు. సోమవారం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. సోమవారం సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని అనిల్ ఇంటికి రేవంత్ వెళ్లారు. అనిల్‌కు రేవంత్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. భువనగిరి జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న కుంభం అనిల్ కుమార్ రెడ్డికి.. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కొన్నాళ్లుగా విభేదాలున్నాయి. తన ఓటమికి కోమటిరెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.
మండల కమిటీల నియామకాలతో అవి మరింత పెరిగాయి. పార్టీకి రాజీనామా చేసి జులై 24న కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. అయితే, రెండు నెలల్లోనే సీన్ రివర్స్ అయింది. భువనగిరి టికెట్‌ను అనిల్ ఎక్స్ పెక్ట్ చేశారు. మళ్లీ సిటింగ్ ఎమ్మెల్యే అయిన పైళ్ల శేఖర్ రెడ్డికే కేసీఆర్ టికెట్‌ను ప్రకటించడంతో.. కుంభం అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మళ్లీ కాంగ్రెస్‌లోకి వచ్చేం దుకు కొన్నాళ్లుగా ప్రయత్నాలు చేశారని పార్టీ నేతలు చెప్తున్నారు. కాంగ్రెస్‌లో పార్టీలో చిన్న చిన్న సమస్యలు సహజమని రేవంత్ రెడ్డి అన్నారు. 2018 ఎన్నికల్లో ఓడినా అనిల్‌ను కాపాడుకుంటూ వచ్చామని గుర్తు చేశారు. సర్వేలో అనిల్ ను తిరిగి పార్టీలోకి తీసుకోవాలని తేలిందని చెప్పారు.