తెలంగాణలో దోపిడీ సర్కారును గద్దె దింపాలె : కుంభం అనిల్​కుమార్​ రెడ్డి

యాదాద్రి, వెలుగు: ప్రజలను  దోచుకుంటున్న బీఆర్ఎస్‌‌ సర్కారు గద్దె దింపాలని కాంగ్రెస్​ భువనగిరి అభ్యర్థి కుంభం అనిల్​కుమార్​ రెడ్డి పిలుపునిచ్చారు.  బుధవారం భువనగిరి, బీబీనగర్​ మండలాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  బీఆర్​ఎస్​ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్​ కుటుంబం ఒక్కటే బాగుపడిందని, ప్రజలందరూ ఇబ్బందుల పాలయ్యారని విమర్శించారు.  ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి సంక్షేమ పథకాలను కేవలం  కార్యకర్తలకే ఇప్పించుకున్నారని ఆరోపించారు.

బీఆర్ఎస్‌‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే ఫైళ్ల అడ్డూ అదుపు లేకుండా మాట్లాడుతున్నారని, ఉద్యోగాలు, డిగ్రీ కాలేజీ అడిగిన యువతను దూషించడమేంటని మండిపడ్డారు. ఓటమి ఖరారు కావడంతో ఫ్రస్టేషన్‌‌లో ఏది పడితే అది మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.  అధికారంలోకి రాగానే.. ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని, స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తానని మాటిచ్చారు. తనను గెలిపిస్తే పేదలకు అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.  అనంతరం వివిధ పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్‌‌లో చేరగా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 

ALSO READ : తెలంగాణలో బీజేపీతోనే బీసీలకు రాజ్యాధికారం : సంకినేని వెంకటేశ్వర్ రావు