ఆరు గ్యారంటీలతో పేదల జీవితాల్లో వెలుగు: కుంభం అనిల్ కుమార్ రెడ్డి

యాదాద్రి, వెలుగు :  ఆరు గ్యారంటీ స్కీమ్‌‌లతో పేదల జీవితాల్లో వెలుగు వస్తుందని  కాంగ్రెస్‌‌ భువనగిరి అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డి చెప్పారు.  బుధవారం భువనగిరి ఆర్‌‌‌‌వో ఆఫీస్‌‌వో నామినేషన్ వేశారు. అంతకుముందు నిర్వహించిన  భారీ ర్యాలీలో ఆయన మాట్లాడారు.  రాష్ట్రంలో కాంగ్రెస్​కు వస్తున్న ఆదరణను బీఆర్​ఎస్​, బీజేపీ తట్టుకోలేక అసత్యప్రచారాలు చేస్తున్నాయని ఆరోపించారు. తొమ్మిదేండ్లు ఎమ్మెల్యేగా ఉన్న శేఖర్​రెడ్డి నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోలేదని విమర్శించారు.

ఆయన నిర్లక్ష్యం కారణంగా భువనగిరి వెనుకబడిందని, ఇక్కడి యువతకు ఉపాధి కరువైందని మండిపడ్డారు. తాను గెలిచిన వెంటనే అభివృద్ధి పనులు స్పీడప్‌‌ చేయడంతో పాటు యువతకు ఉపాధి కల్పిస్తానని హామీ ఇచ్చారు.  అంతకుముందుగా కుటుంబ సభ్యులతో కలిసి జూబ్లిహిల్స్​లోని పెద్దమ్మ టెంపుల్​, బీబీనగర్​లోని లింగ బసవేశ్వరస్వామి టెంపుల్​లో పూజలు నిర్వహించారు.