యాదాద్రి, వెలుగు : కాంగ్రెస్ గెలిస్తేనే.. రాబోయే రోజుల్లో యువతకు ఉపాధి దొరకడంతోపాటు ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయని భువనగిరి అభ్యర్థి కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. తొమ్మిదేండ్ల బీఆర్ఎస్ పాలనతో యువతకు ఉద్యోగాలు ఇవ్వలేని చెప్పారు. భువనగిరి మండలంలో శుక్రవారం ఆయన ఇల్లిల్లూ తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజల సేవ కోసమే రాజకీయాల్లో కొనసాగుతున్న తనను గెలిపించాలని కోరారు.
గత ఎన్నికల్లో తాను ఓడిపోయినా.. ఇక్కడే ఉన్నానని, ప్రజా సమస్యల కోసం ఆందోళనలను నిర్వహించిన సంగతి గుర్తుచేశారు. ఆరు గ్యారెంటీలతో కలిగే ప్రయోజనాలను వివరించారు. వీటితో ప్రజల జీవితాల్లో మంచి మార్పు వస్తుందని చెప్పారు. పేదలకు ఎప్పుడూ అండగా నిలబడి ఆదుకునే కాంగ్రెస్‌ను గెలిపించాలని వారు కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. ప్రకటించిన ఆరు గ్యారెంటీలను వెంటనే అమలు చేస్తామన్నారు.
కాంగ్రెస్ హయాంలో చేపట్టిన పనులనే తాను చేపట్టినట్టుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని విమర్శించారు. కుంభం గెలుపును కోరుతూ మాజీ ఎంపీ వీ హనుమంతరావు ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో కాంగ్రెస్ లీడర్లు పోత్నక్ప్రమోద్ కుమార్, పడిగెల రేణుక ప్రదీప్ ఉన్నారు.