వచ్చేది గ్యారంటీగా కాంగ్రెస్​ సర్కారే​ : కుంభం అనిల్​కుమార్​రెడ్డి

యాదాద్రి, వెలుగు :  కాంగ్రెస్​ ఆరు గ్యారంటీలతో  ప్రజలు గ్యారంటీగా కాంగ్రెస్​కు ఓటు వేసి గెలిపిస్తారని ఆ పార్టీ భువనగిరి అభ్యర్థి కుంభం అనిల్​కుమార్​రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని వలిగొండ, భువనగిరి మండలాల్లో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్​  ఆరు గ్యారంటీలను ఓటర్లకు తెలిపారు. గత ఎన్నికల్లో తాను ఓడిపోయినా.. నియోజకవర్గంలోనే ఉండి సేవ చేశానని చెప్పారు.  

ఈ ఎన్నికల్లో తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. ముందుగా వెంకటేశ్వరస్వామి టెంపుల్​లో పూజలు నిర్వహించారు. అనంతరం భువనగిరిలో కాంగ్రెస్​ ఎన్నికల ఆఫీసును ఎంపీ కోమటిరెడ్డితో కలిసి ప్రారంభించారు.