ప్రభుత్వంపై బీఆర్‌‌‌‌ఎస్‌‌ నేతల విమర్శలు సిగ్గుచేటు : కుంభం అనిల్ కుమార్ రెడ్డి

భూదాన్ పోచంపల్లి, వెలుగు: పదేండ్లలో పేదలకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వని బీఆర్‌‌‌‌ఎస్‌‌ లీడర్లకు ఇప్పుడు కాంగ్రెస్‌‌ ప్రభుత్వాన్ని విమర్శించడం సిగ్గుచేటని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. బుధవారం భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీ కేంద్రంలోని బాలాజీ ఫంక్షన్ హాల్‌‌లో 37 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  బీఆర్‌‌‌‌ఎస్‌‌ నేతలు పదేండ్లు అధికారంలో ఉన్నా పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, రైతులకు రుణమాఫీ చేయలేదని మండిపడ్డారు. తమ ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు కూడా కాకముందే  విమర్శలు చేయడం సరికాదన్నారు.  ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ తప్పకుండా నెరవేరుస్తామని, జిల్లాలో భునాదిగాని కాలువ, పిలాయిపల్లి కాలువ నిర్మాణాలు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాడుగుల ప్రభాకర్ రెడ్డి, మున్సిపాలిటీ చైర్మన్ విజయలక్ష్మి, ఆర్డీవో శేఖర్ రెడ్డి , కౌన్సిలర్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.