యాదాద్రి, వెలుగు : కాంగ్రెస్ గెలిస్తేనే ప్రజలకు న్యాయం జరుగుతుందని ఆ పార్టీ భువనగిరి అభ్యర్థి కుంభం అనిల్‌కుమార్ రెడ్డి చెప్పారు. శుక్రవారం వలిగొండ, భూదాన్ పోచంపల్లి, భువనగిరి మండలంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు సంబంధించిన కరపత్రాలను అందించారు. అధికారంలోకి రాగానే ఈ గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పారు.
కర్నాటకలో ఇచ్చిన హామీలు ఇప్పటికే అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌పార్టీని, సోనియాగాంధీనికి బీఆర్ఎస్ లీడర్లు విమర్శిస్తున్నారని మండిపడ్డారు. సోనియాకు గాంధీ రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందని, ప్రతి ఓటరు వినియోగించుకోవాలని సూచించారు. ప్రచారం జరుగుతున్న సమయంలోనే వివిధ పార్టీలకు చెందిన యువత కాంగ్రెస్‌లో చేరారు.