కుంభమేళా... ప్రయాగ్ రాజ్ .. రుచికరం.. టేస్ట్ అదుర్స్ .. తప్పక తినండి

కుంభమేళా ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో ఫిబ్రవరి 26 వరకు కొనసాగుతుంది.  భారతదేశం రుచికరమైన వంటకాలకు నిలయం.    ఒక్కో ప్రదేశంలో ఒక్కో వంటకం ఫేమస్.. ఇక ఆప్రాంతానికి వెళితే దానిని రుచి చూస్తారు.  వీలుంటే ఇంటికి కూడా తెచ్చుకొని కొన్ని రోజుల పాటు తింటారు.  అలాగే ఇప్పుడు కుంభమేళా జరిగే ప్రయాగ్ రాజ్ లో కొన్ని వంటకాలు ఎంతో రుచికరంగా ఉంటాయి. అక్కడ లభించే ఫేమస్ వంటకాల గురించి తెలుసుకుందాం. . 

దహీ జిలేబి:  ఇది ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది కదా అనుకుంటారు.  కాని ప్రయాగ్ రాజ్ లో తయారు చేసిన దహీ జిలేబీనీ తిన్నారంటే లొట్టలేయాల్సిందే.  సాధారణంగా దహీ జిలేబీని దోసెతో కలిపి తింటారు. ఇది చాలా రుచికరంగా ఉంటుంది. దహీ జిలేబి చేయడానికి, తెల్లటి పిండిని దోసేతో కలిపి, తర్వాత నూనెలో వేసి జిలేబిలాగా చేస్తారు. దీనికోసం వీకెండ్ సమయంలో చుట్టు పక్కల పల్లెల నుంచి వస్తారు.  ఇది చాలా రుచికరంగా ఉంటుంది. 

చూర్ణం:  సాధారణంగా ఊరు మారిన తరువాత వాతారణం.. తాగే నీరు.. తినే పదార్థాలు.. మారతాయి.  దీంతో శరీరం కొన్ని ఇబ్బందులు పడే పరిస్థితులు ఏర్పడుతాయి.  కుంభమేళాకు వెళ్లే భక్తులు ప్రయాగ్ రాజ్ లో  లభించే చూర్ణం అనే వంటకాన్ని తింటే అలాంటి ఇబ్బందులనుంచి బయటపడతారు.  చూర్ణం అంటే కొన్ని మందులు  కలయికతో తయారైన చక్కటి పొడి. ఆయుర్వేద వైద్యంలో చూర్ణాలను మందులు లేదా ఔషధాలుగా ఉపయోగిస్తారు. చూర్ణాలను రాజ్ మరియు క్షడ అని కూడా అంటారు.

Also Read :- తిరుమలకు పోటెత్తిన భక్తులు

 ప్రయాగ్ రాజ్ లో లభించే చుర్మారా చూర్ణం తినడాకి ఎంతో టేస్టీగా ఉంటుంది.  అంతే కాదు.. శరీరంలోని నిస్సవుత్తును తొలగించి.. ఉల్లాసంగా  ఉత్సాహంగా ఉంచుతుంది.  దీనిని తయారీకి అక్కడ లభించే కొన్ని ఔషధ మూలికలతో పాటు లైయా.. మురి.. ముర్ముర అనే సుగంధ ద్రవ్యాలతో పాటు , సెవ్, వేరుశెనగలు,  మిరపకాయలు , టమోటా ఉల్లిపాయలను ఉపయోగిస్తారు. వీటికి కొద్దిగా నిమ్మరసం కలిపామంటే..  ఇక టేస్ట్ అదుర్స్ అంటున్నారు.. ప్రయాగ్ రాజ్ ప్రజలు.. మీరు కుంభమేళాకు వెళ్తే ఓ సారి టేస్ట్ చేయండి... 

లవంగం లత:  ఇది స్వీట్ ఐటమ్.. మనం లడ్డూను ఎంత ఇష్ట పడతామో ఉత్తరప్రదేశ్ ప్రజలు లవంగం లతను అంతకంటే ఎక్కువ ఇష్ట పడతారట.  దీనిని బెంగాల్ ప్రజలు కూడా కొంతమంది తింటారు.  దీని రుచి చాలా అద్భుతంగా ఉంటుంది.  కొన్ని ప్రాంతాల్లో లౌంగ్ లత అని కూడా పిలుస్తారు. దీనిని తయారు చేయడానికి బియ్యం పిండి.. గోధుమపిండిని ఉపయోగిస్తారు.   ఈ రెంటిని 2:3 నిష్పత్తిలో తీసుకోవాలి.  అందులో పాలు పోసి  చపాతీ పిండి  మాదిరిగా కలపాలి.  తరువాత పిండిని మడత పెట్టి .. అందులో మిల్క్ మావాతో పూరించాలి.  తరువాత మడత తెరుచుకోకుండా లవంగాలతో క్లోజ్ చేయాలి. వీటిని నూనెలో వేయించాలి.  తరువాత లేత బెల్లం పానకంలో ముంచి తీసి ఆరబెడతారు. 

అంగూరి పేట:  దీనినిపొట్లకాయ.. గుమ్మడికాయల రసం .. చక్కెరతో తయారు చేస్తారు.  ఇది ప్రయాగ్ రాజ్ చాలా ప్రసిద్దమైన స్వీట్ వంటకం .  దీనిని అక్కడ పేదవారి స్వీట్ అంటారు.  ఈ స్వీట్‌లో ఐరన్, కాల్షియం, ఫాస్పరస్, సల్ఫర్ , విటమిన్ ఎ, బి, సి, ఇ పుష్కలంగా ఉన్నాయి. పైల్స్, ముక్కు నుండి రక్తస్రావం, వంటి సమస్యలకు చికిత్స చేయడానికి ఆయుర్వేదంలో  ఉపయోగిస్తారు. పూర్వకాలంలో అడవికి వెళ్లేవారు తినేందుకు ఈ పదార్దాన్ని తీసుకెళ్లేవారు. అంగూరి పేటతో పాటు  ,  కేసర్ అంగూరి పేట ,  గులాబీ పేట , కొబ్బరి పేట , మామిడి పేట మరియు సీజనల్ పండ్లతో తయారు చేసిన పేట కూడా అందుబాటులో ఉన్నాయి. ఇది మృదువైన మిఠాయి లాంటిది.  ఇది రుచి మరియు ఆకృతిలో చాలా తేలికగా ఉంటుంది.

షార్ట్ బ్రెడ్ కూరగాయ:  ఇది ప్రయాగ్‌రాజ్‌లో చాలా రుచికరమైన వంటకం.  ఇందులో కచోరీని ఉరద్ పప్పు..  దేశీ నెయ్యితో తయారు చేస్తారు.  బంగాళాదుంప ..  టమోటా వివిధ రకాల  కూరగాయలను ఉడికించి తయారు చేస్తారు. మీరు మహాకుంభం కోసం ప్రయాగ్‌రాజ్‌కి వెళుతున్నట్లయితే మీరు తినే జాబితాలో కచోరి కూరగాయలను  చేర్చుకోండి

మోటైన రసగుల్లా:  కుంభమేళాకు వెళ్లి ప్రయాగ్ రాజ్ రసగుల్లాను తినకపోతే .... తిరిగి వచ్చిన తరువాత.. అక్కడ రసగుల్లా గురించి ఎవరైనా చెబుతుంటే జీవితంలో ఏదో కోల్పోయామని ఫీలవుతారు. బైరాహ్నాలోని ప్రసిద్ధ దుకాణంలో మీరు నగరంలోని అత్యంత రుచికరమైన రసగుల్లా లభిస్తుంది.