రాయికల్, వెలుగు: ఈ నెల 21 నుంచి 25 వరకు పుదుచ్చేరిలో జరిగిన సౌతిండియా సైన్స్ ఫెయిర్‌లో రాయికల్ మండలం కుమ్మరిపల్లి హెచ్‌ఎం కడకుంట్ల అభయ్‌రాజ్ రూపొందించిన ఎగ్జిబిట్ ఎంపికైంది. తక్కువ ఖర్చు, ఖర్చు లేని బోధనోపకరణాలతో ఆయన రూపొందించిన సూపర్ సైన్స్ కిట్ సైన్స్ ఫెయిర్‌లో ప్రత్యేక బహుమతికి ఎంపికైంది.
పుదుచ్చేరి ఎన్‌ఆర్‌సీటీ డైరెక్టర్ ప్రియదర్శిని, జాయింట్ డైరెక్టర్ శివగామి ఈ మేరకు శనివారం బహుమతి అందజేశారు. ఈ సందర్భంగా హెచ్‌ఎంను డీఈవో రాము, జిల్లా సైన్స్ అధికారి రాజశేఖర్, ఎంఈవో శ్రీపతి రాఘవులు, టీచర్ సంఘాల నాయకులు అభినందించారు