రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక సదస్సుకు ఎంపిక :హెచ్ఎం కడకుంట్ల అభయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక సదస్సుకు ఎంపిక :హెచ్ఎం కడకుంట్ల అభయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

రాయికల్, వెలుగు: ఈ నెల28న జాతీయ వైజ్ఞానిక దినోత్సవం సందర్భంగా రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి సైన్స్ సదస్సుకు రాయికల్ మండలం కుమ్మరిపల్లి ప్రైమరీ స్కూల్​ హెచ్ఎం కడకుంట్ల అభయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎంపికైనట్లు జిల్లా సైన్స్ అధికారి రాజశేఖర్ బుధవారం తెలిపారు. ‘మన చుట్టూ ఉన్న ప్రపంచంలో విజ్ఞాన శాస్త్రం’ అనే అంశంపై రాష్ట్రవ్యాప్తంగా పరిశోధన పత్రాలు ఆహ్వానించగా జగిత్యాల జిల్లా నుంచి అభయ్ రాజ్ రూపొందించిన పరిశోధన పత్రం ఎంపికయ్యింది. ఈ సందర్భంగా హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంను డీఈవో  కె. రాము, ఎంఈవో శ్రీపతి రాఘవులు, పీఆర్ టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పొన్నం రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మండల అధ్యక్షుడు గంగారాజం, ప్రధాన కార్యదర్శి నర్సయ్య అభినందించారు.

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక

కోరుట్ల,వెలుగు: జగిత్యాల జిల్లా అథ్లెటిక్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన లాంగ్ జంప్ పోటీల్లో పైడిమడుగు జడ్పీ హైస్కూల్  విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు హెచ్ఎం ఆనంద్​ తెలిపారు. అండర్ 16 లాంగ్ జంప్ విభాగంలో ఆకుల రామ్ చరణ్, అండర్ 18 విభాగంలో దుమ్మాల నవదీప్.. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు పేర్కొన్నారు. ఎంపికైన విద్యార్థులను పీడీ శ్రీలత, టీచర్లు అభినందించారు.