
జైనూర్, వెలుగు : ఆదివాసీ హక్కుల కోసం పోరాటం చేసిన కుమ్రంభీం మనవడు ప్రస్తుతం ఉపాధి హామీ పనులు చేస్తున్నాడు. ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు) మండలంలోని దోబ గ్రామానికి చెందిన కుమ్రం భీం మనవడు సోనేరావు వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు.
ప్రస్తుతం వ్యవసాయ పనులు లేకపోవడంతో తన జాబ్‌కార్డులోని పని దినాలు పూర్తి చేసేందుకు ఉపాధి హామీ పనులకు వెళ్తున్నాడు. శుక్రవారం తన భార్య గౌరుతో కలిసి గుంతలు తవ్వే పనికి వెళ్లాడు. ఉద్యమకారుడి వారసులు కూలీ పనికి వెళ్తుండడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.