ఒక వరుడు.. ఇద్దరు వధువులు..ఒకే మండపంలో ఇద్దరిని పెళ్లాడిన యువకుడు

ఒక వరుడు.. ఇద్దరు వధువులు..ఒకే మండపంలో ఇద్దరిని పెళ్లాడిన యువకుడు
  • ఆసిఫాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో ఘటన.. సోషల్‌‌‌‌‌‌‌‌ మీడియాలో వైరల్‌‌‌‌‌‌‌‌

జైనూర్, వెలుగు : ఒకే యువకుడు.. ఒకే మండపంలో.. ఒకేసారి ఇద్దరు అమ్మాయిలను పెండ్లి చేసుకున్నాడు. కుమ్రంభీం ఆసిఫాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లా లింగాపూర్‌‌‌‌‌‌‌‌ మండలంలోని గుంనూరు గ్రామంలో గురువారం జరిగిన ఈ పెండ్లి వీడియోలు సోషల్‌‌‌‌‌‌‌‌మీడియాలో వైరల్‌‌‌‌‌‌‌‌గా మారాయి. వివరాల్లోకి వెళ్తే... గుంనూర్‌‌‌‌‌‌‌‌ గ్రామానికి చెందిన సెడ్మకి సూర్యదేవ్‌‌‌‌‌‌‌‌ అనే యువకుడు సిర్పూర్‌‌‌‌‌‌‌‌ యు మండలంలోని పుల్లార గ్రామానికి చెందిన ఆత్రం జల్కర్‌‌‌‌‌‌‌‌దేవిని, శెట్టిహడ్పనూర్‌‌‌‌‌‌‌‌ రాజుల్‌‌‌‌‌‌‌‌గూడ గ్రామానికి చెందిన కనక లాల్‌‌‌‌‌‌‌‌దేవిని మూడేళ్లుగా ప్రేమిస్తున్నాడు. బంధువులు లాల్‌‌‌‌‌‌‌‌దేవితో పెండ్లి నిశ్చయించారు.

ఈ విషయం తెలుసుకున్న జల్కర్‌‌‌‌‌‌‌‌దేవి తననే పెండ్లి చేసుకోవాలని పట్టుబట్టింది. ఈ విషయం కులపెద్దల దృష్టికి రావడంతో వారు ఇద్దరు అమ్మాయిల కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఇద్దరిని పెండ్లి చేసుకునేందుకు యువకుడు ఓకే చెప్పడంతో కుటుంబ సభ్యులు కూడా అంగీకరించారు. దీంతో వారితో కులపెద్దలు ఒప్పంద పత్రం రాయించారు. అనంతరం గురువారం గుంనూరు గ్రామంలో పెండ్లి చేశారు. ఈ వివాహానికి సుమారు 500 మంది బంధువులు హాజరయ్యారు.