
కొమురం భీం అసిఫాబాద్ జిల్లాలో ఉద్రిక్త నెలకొంది. రెబ్బెన మండలం తుంగెడ అటవీ ప్రాంతంలో అటవీశాఖ అధికారులు, పొడు రైతులకు మధ్య గొడవ జరిగింది. అక్రమంగా కొత్త పోడు చేస్తున్నారని అటవీ అధికారులు అడ్డుకున్నారు. దీంతో పోడు రైతులకు,పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. తమపై స్ధానికులు దాడి చేశారని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు.