
Kunal Kamra: ప్రముఖ కమీడియన్ కునాల్ కామ్రా ఇటీవలి కాలంలో చేస్తున్న పేరడీలు తెగ వైరల్ అవుతున్నాయి. కొన్ని నెలల కిందట ఆయన ఓలా స్కూటర్లపై చేసిన కామెంట్స్ ఏకంగా ఆ కంపెనీ షేర్లను ప్రతికూలంగా ప్రభావితం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ స్టాండింగ్ కమెడియన్ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండే మీద చేసిన పేరడీ వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. తాను చేసిన వ్యాఖ్యలకు ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమాపణలు చెప్పేదిలేదన్న కామ్రా నేడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ని కూడా వదలలేదు.
వివరాల్లోకి వెళితే కునాల్ తాజాగా మిస్టర్ ఇండియా సినిమాలోని హవా హవాయి పాటపై పేరడీ చేశారు. ఇందులో నిర్మలా సీతారామన్ పన్ను చెల్లింపుదారుల సొమ్మును వృధా చేస్తున్నారనే ఆరోపణలు చేశారు. ప్రజల సొమ్మును లూటీ చేసేందుకు శారీ వాలీ దీదీ ఆఈ అంటూ నిర్మలమ్మపై ధ్వజమెత్తారు. ఇదే సమయంలో పాప్ కార్న్ పై పన్ను విషయానికి సంబంధించి కూడా పేరడీలో కామెంట్స్ చేయటం గమనార్హం.
ALSO READ | Stock to Buy: 100% లాభం ఇవ్వనున్న స్టాక్.. రూపాయికి రూపాయి లాభం పక్కా..!
ఇక్కడితో వదలని కునాల్ ఆమె తప్పుడు యూనివర్సిటీలో చదువుకున్న దేశం కోరుకుంటున్న ఆర్థిక మంత్రి అని కూడా కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం నియంతృత్వ పోకడలను కొనసాగిస్తోందని కునాల్ అన్నారు. ప్రస్తుతం కునాల్ చేసిన వ్యాఖ్యలపై ప్రజలు నెట్టింట తమదైన శైలిలో స్పందిస్తున్నారు.
మరోపక్క ముంబైలోని ఖార్ పోలీస్ స్టేషన్ కమ్రాకు రెండవ సమన్లు జారీ చేసి విచారణకు హాజరు కావాలని కోరింది. దీనికి ముందు ముంబై పోలీసులు హాస్యనటుడిని మంగళవారం ఉదయం 11 గంటలకు హాజరు కావాలని పిలిచారు. కానీ కామ్రా మాత్రం తన న్యాయవాది ద్వారా ఇందుకోసం వారం గడువు కోరారని తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసులు అతడికి అడిగిన సమయాన్ని ఇవ్వలేదు.