
స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా (Kunal Kamra) ఇటీవల చేసిన ఓ కామెడీ వీడియో ఎంతటి సంచలనం రేపిందో చూశాం.ముంబైలోని హాబిటాట్ సెంటర్‌లో జరిగిన ఒక ప్రైవేట్ స్టాండ్ అప్ షో సందర్భంగా కునాల్ కమ్రా, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే పై సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లోకెక్కాడు.
అంతేకాకుండా ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా, అరవింద్ కేజ్రీవాల్‌లపై జోకులు వేయడంతో, ఆ వీడియో తెగ వైరల్ అయింది. కేవలం రెండు రోజుల్లోనే రెండు కోట్లకు పైగా నెటిజన్లు కునాల్ వీడియోను వీక్షించారు.
ఈ క్రమంలో మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. కలర్స్ టీవీలో ప్రసారమయ్యే సల్మాన్ ఖాన్ రియాలిటీ షో 'బిగ్ బాస్' కోసం కునాల్‌ను ఆహ్వానించారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే బిగ్ బాస్ బృందం రాబోయే సీజన్ 19 కి కునాల్ కమ్రాతో చర్చలు జరిపినట్లు సైతం వినిపిస్తోంది.
అయితే, ఈ వార్తలపై కునాల్ ఇంస్టాగ్రామ్ ద్వారా గట్టిగానే స్పందించాడు. బిగ్ బాస్ 19 సీజన్ కోసం కాస్టింగ్‌ను నిర్వహిస్తున్నాను.. అని చెప్పుకునే వ్యక్తితో తాను వాట్సాప్‌లో మాట్లాడినట్లు చెప్పిన స్క్రీన్‌షాట్‌ను పంచుకున్నాడు.
"బిగ్ బాస్కు వెళ్లే బదులు.. మెంటల్ హాస్పిటల్‌లో చేరడం మంచిది. నా పేరు వస్తోందని మీ దృష్టిలో ఉండకపోవచ్చని నాకు తెలుసు. కానీ నిజాయితీగా చెప్పాలంటే, మీ నిజమైన వైబ్‌ను చూపించడానికి, భారీ ప్రేక్షకులను గెలవడానికి, ఇది చాలా పిచ్చి వేదిక. మీరు ఏమనుకుంటున్నారు? మనం దాని గురించి మాట్లాడాలా?" దానికి బదులు నేను పిచ్చి ఆసుపత్రిలో చేరడం చాలా మంచిది..." అంటూ పోస్ట్ చేశాడు.
బాలీవుడ్ బిగ్ బాస్ టీమ్ వివాదాస్పద సెలబ్రిటీలను షోకి తీసుకురావాలనే వ్యూహాన్ని అనుసరిస్తూ వస్తోంది. ఈ క్రమంలో కునాల్ పేరు కూడా వినిపిస్తోంది. ఒకవేళ సీజన్ 19లోకి కునాల్ వస్తే, తన ముక్కుసూటితనం, హాస్యంతో బిగ్ బాస్ ఇంట్లో ఎలాంటి రచ్చ చేయనున్నాడో అనే ఆసక్తి నెలకొంది.