యువతకు ఉపాధి కల్పనకు కృషి : కుందూరు జానారెడ్డి

హాలియా, వెలుగు: స్కిల్​ డెవలప్​మెంట్​ప్రోగ్రాం ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తున్నామని మాజీ సీఎల్పీ లీడర్​ కుందూరు జానారెడ్డి చెప్పారు.  మంగళవారం నల్గొండ జిల్లా హాలియా పట్టణంలోని రిటైర్డ్​ ఎంప్లాయిస్​ భవనంలో  ఏకే ఫౌండేషన్ చైర్మన్ కట్టెబోయిన అనిల్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువత కోసం జాబ్​మేళా నిర్వహించడం అభినందనీయమన్నారు. 

కాగా,  జాబ్ మేళాలో ఎడ్బ్రిడ్జ్, క్వెస్ క్రాప్ లిమిటెడ్, థ్రెడ్జ్ టెక్ లిమిటెడ్, మారుతి సుజుకి, డీ మార్ట్ లిమిటెడ్, యురేకా పోబ్స్ తదితర కంపెనీలు పాల్గొన్నాయి. మొత్తం 200 మంది సెలెక్ట్ అయినట్లు నిర్వాహకులు తెలిపారు.   ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి, సాగర్ ఎడమ కాలువ మాజీ చైర్మన్ మల్గిరెడ్డి లింగారెడ్డి,  జిల్లా కార్యదర్శి కాకునూరి నారాయణ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తుమ్మలపల్లి శేఖర్ రెడ్డి, కౌన్సిలర్​ గౌని సుధారాణి -రాజారమేశ్, టౌన్​ అధ్యక్షుడు వెంపటి శ్రీనివాస్​, మాజీ జడ్పీటీసి రావుల చినబిక్షం యాదవ్, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు రావుల రాంబాబు, మాజీ ఎంపీపీ చవ్వా బ్రహ్మానంద రెడ్డి, శంకర్ నాయక్  పాల్గొన్నారు.