కేసీఆర్​ గిరిజనులను మోసం చేస్తున్రు

కేసీఆర్​ గిరిజనులను మోసం చేస్తున్రు
  • కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు కుందూరు జయవీర్ రెడ్డి

హాలియా, వెలుగు : సీఎం కేసీఆర్ గిరిజనులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేస్తున్నారని కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు కుందూరు జయవీర్ రెడ్డి ఆరోపించారు. బుధవారం నల్గొండ జిల్లా పెద్దవూర మండలం గేమ్యా నాయక్ తండాలో గిరిజన చైతన్య యాత్రను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి హయాంలోనే నాగార్జున సాగర్ నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందని, బీఆర్​ఎస్​ చేసిందేమీ లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

కీర్యానాయక్​ తండా, ఉట్లపల్లి , ఎర్ర చెరువు తండా, కేకేతండా, బాసోనిభావి  తండా, జయరాంతండ మీదుగా యాత్ర కొనసాగింది. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్, పీసీసీ డెలిగేట్ కర్నాటి లింగారెడ్డి, పీసీసీసెక్రటరీ కొండేటి మల్లయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తుమ్మలపల్లి చంద్రశేఖర్ రెడ్డి, జేజే సేదయ్య బాబు తదితరులు పాల్గొన్నారు.