కేసీఆర్​మాటలు నమ్మితే మోసపోతాం..కుందూరు జయవీర్ రెడ్డి

హాలియా, వెలుగు : ఓట్ల కోసం కేసీఆర్​ చెప్పే మాటలు  నమ్మితే మరోసారి మోసపోక తప్పదని కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు కుందూరు జయవీర్ రెడ్డి అన్నారు. గిరిజన చైతన్య యాత్ర లో భాగంగా జయవీర్ రెడ్డి శుక్రవారం నల్గొండ జిల్లా త్రిపురారం మండలంలోని డొంకతండా, కాన్యాతండా, ఇస్లావత్​తండా, ఆరాతండా, రుప్లాతండా, సీత్యా, లోక్య సుర్య మంగలతండా, రెడ్యతండా, రాజేందర్​నగర్ తండాల్లో  పాదయాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం గత ఎన్నికల్లో ​ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయలేదని చెప్పారు. 

కాంగ్రెస్ పార్టీకి రోజురోజుకు ఆదరణ పెరుగుతోందన్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు కేతావత్​ శంకర్​నాయక్, పీసీసీ డెలిగేట్ కర్నాటి లింగారెడ్డి, కొండేటి మల్లయ్య,  బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ధనసింగ్​నాయక్, తుమ్మలపల్లి చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీపీ అనుముల పాండ్రమ్మ శ్రీనివాస్​రెడ్డి, చవ్వా బుచ్చి రెడ్డి, సోషల్​ మీడియా ఇన్​చార్జ్​ జేజే సేదయ్య బాబు, తదితరులు పాల్గొన్నారు.