గ్రామాల అభివృద్ధే  ప్రభుత్వ ధ్యేయం : కుందూరు జైవీర్​ రెడ్డి

హాలియా, వెలుగు:  గ్రామాల అభివృద్ధే  లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని  చేస్తోందని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్​ రెడ్డి అన్నారు. బుధవారం నల్గొండ జిల్లా అనుముల మండలం చింతగూడెం లో  గ్రామపంచాయతీ భవనాన్ని  ప్రారంభించారు.

 గ్రామాల్లో మౌలిక వసతులు కల్పనకు తన వంతు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మాల అరుణ సత్యనారాయణ రెడ్డి,  సర్పంచ్ కూరాకుల లింగమ్మ,  పార్టీ జిల్లా కార్యదర్శి కాకునూరి నారాయణ గౌడ్  పాల్గొన్నారు.