హనుమకొండ, వెలుగు : టీఎన్జీవోస్ హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షుడిగా కాకతీయ మెడికల్ కాలేజీ జూనియర్ అసిస్టెంట్ కుందూరు లోకేందర్ రెడ్డి ఎన్నికయ్యారు. ఈ మేరకు జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్ ఆయనకు మంగళవారం నియామక పత్రం అందజేశారు. అనంతరం టీఎన్జీవో జిల్లా కార్యవర్గ సభ్యులు లోకేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా లోకేందర్ రెడ్డి మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన జిల్లా అధ్యక్షుడు రాజేందర్, కార్యదర్శి సోమయ్య, జిల్లా కార్యవర్గానికి కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో కేంద్ర సంఘం కోశాధికారి రామినేని శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి బైరి సోమయ్య, అసోసియేట్ అధ్యక్షుడు పుల్లూరు వేణుగోపాల్, కేంద్ర సంఘం నేతలు శ్యాంసుందర్, కత్తి రమేశ్, రాము నాయక్, మోయిస్, లక్ష్మీప్రసాద్, జిల్లా నేతలు సురేశ్, భగవాన్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, శ్రీనివాస్, భరత్, అనూప్, ప్రణయ్, పృథ్వీ, అశోక్, వెంకన్న, రమేశ్, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.