రాష్ట్రంలోనే హైయెస్ట్ మెజార్టీతో కుందురు రఘవీర్ రెడ్డి భారీ విజయం

నల్లగొండ జిల్లా : లోక్ సభ ఎన్నికలు 2024 రిజల్ట్స్ లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో నల్గొండ నుంచి కుందురు రఘువీర్ గెలిచారు. బీజేపీ అభ్యర్థి సైదిరెడ్డిపై 5లక్షల 50వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు. కౌంటింగ్ పూర్తైన వెంటనే నల్గొండ పార్లమెంట్ అభ్యర్థిగా గెలుపొందిన కుందూరు రఘువీర్ రెడ్డికు ఎన్నికల అధికారులు మనోజ్ కుమార్ మాణిక్ రావు సూర్యవంశీ, జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన సర్టిఫికెట్ ను అందజేశారు. 

వారితోపాటు జిల్లా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కుందురు జైవీర్, కుందురు జానారెడ్డి, ముఖ్య నాయకులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 17లోక్ సభ స్థానాలకు గాను కాంగ్రెస్ 8 సీట్లు కైవసం చేసుకుంది.