హనుమాన్ ఆలయంలో కుందూరు రఘువీర్ రెడ్డి ప్రత్యేక పూజలు

హాలియా, వెలుగు : నల్గొండ జిల్లా హాలియా పట్టణంలోని హనుమాన్​ టెంపుల్​లో ఆదివారం అయ్యప్ప స్వామి జన్మదినం సందర్భంగా కాంగ్రెస్  నల్గొండ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.  రఘువీర్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలుపొందాలని గురుస్వాములు, అయ్యప్ప భక్తులు ఆశీర్వదించారు.

ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్​ జిల్లా అధ్యక్షుడు గౌని రాజారమేష్​ యాదవ్​, సైదులు, ఎడవల్లి రాంబాబు, యేసు రాజు, బాలు, వెంకన్న, మిట్టపల్లి శ్రీనివాస్, నాగయ్య, మల్లయ్య గురుస్వాములు, అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు.