నవోదయకు ఒకే స్కూల్​ నుంచి 34 మంది విద్యార్థులు ఎంపిక

నవోదయకు ఒకే స్కూల్​ నుంచి 34 మంది విద్యార్థులు ఎంపిక

కుంటాల, వెలుగు: జవహర్ నవోదయ ప్రవేశ పరీక్షలో ఉత్తమ ఫలితాలు సాధించిన కుంటాలలో సృజన విద్యానిలయం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఉమ్మడి జిల్లాలోని కాగజ్​నగర్​లో ఉన్న నవోదయ విద్యాలయ ఆరో తరగతి ప్రవేశ పరీక్షలో 80 సీట్లకు గానూ కుంటాల సృజన పాఠశాల విద్యార్థులే 34 సీట్లు సాధించారు. 

ఎంపికైన విద్యార్థులను గురువారం స్కూల్​నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ఐదు వేల మందికిపైగా విద్యార్థులు అర్హత పరీక్ష రాయగా తమ స్కూల్ ​విద్యార్థులు 34 మంది సీట్లు సాధించడం ఆనందంగా ఉందని ప్రిన్సిపాల్ కె.గంగన్న అన్నారు. టీచర్లను అభినందించారు. కార్యక్రమంలో ఎంఈవో ముత్యం,ఏవో విక్రమ్, ఏఈవో శ్రీనివాస్, పేరెంట్స్ కమిటీ చైర్మన్ సబ్బిడి రాకేశ్, టీచర్స్, విద్యార్థుల పేరెంట్స్ పాల్గొన్నారు.