ఎట్టకేలకు ఎంపీపీని ఎన్నుకున్నారు

ఆ మండలానికి ఇద్దరంటంటే ఇద్దరే ఎంపీటీసీలు! ఎంపీపీ నువ్వా నేనా అన్నట్టు ఆ ఇద్దరి మధ్యా పోటీ జరిగింది. ఇద్దరిలో ఒకరిని ఎన్నుకునేందుకు కనీసం ప్రతిపాదించేవాళ్లూ లేరు. దీంతో ఈనెల 7న నిర్వహించిన ఎంపీపీ ఎన్ని కల నుంచి ఆ మండలానికి మినహాయింపునిచ్చారు. ఆ మండలం వరంగల్ జిల్లాలోని పలిమెల. ఆ మండలానికి సర్వాయిపేట నుం చి ఎస్టీ సామాజిక వర్గా నికి చెందిన కురుసం బుచ్చక్క, పలిమెల నుం చి బీసీ సామాజిక వర్గా నికి చెందిన కల్యాణిలు ఎంపీటీసీలుగా గెలిచారు. ఆ ఇద్దరూ కాంగ్రెస్ పార్టీ వాళ్లే కావడం విశేషం. ఇద్దరే ఉండడంతో ఎవరిని ఎన్నుకోవాలోతెలియక, ప్రతిపాదిం చే వాళ్లూ లేక ఎంపీపీ ఎన్నికను వాయిదా వేశారు. అసలు మండలాధ్యక్షులు ఉండరనే అధికారులు తేల్చేశారు. కానీ, తమ మండలం కొత్తగా ఏర్పడిందని, అభివృద్ధి కోసం కొత్త అధ్యక్షులు అవసరమని ఆ మండలానికి చెందిన ప్రజలు, అధికారులకు విజ్ఞప్తులు చేశారు. దీంతో ఎన్నికల కమిషనర్ కు పలిమెల ఎంపీడీవో సురేం దర్ , అధ్యక్షుల అవసరం గురిం చి వివరిం చి చెప్పా రు. ఈ నెల 22న ఎన్ని కనిర్వహించా లని, ఎస్టీ మహిళకు అవకాశం ఇవ్వాలని ఈ నెల 18న సూచించా రు. దీంతో ఎంపీపీగా ఎస్టీ అయిన బుచ్చక్క ఎన్నిక లాంఛనం అయింది., ఎంపీపీ కార్యాలయాన్ని తాత్కాలికంగా మండల కేంద్రంలోని ప్రభుత్వ బడిలో ఏర్పాటు చేశామని ఎంపీడీవో సురేం దర్ తెలిపారు. మహదేవ్ పూర్ మండలం నుంచి పలిమెల కొత్త మండలంగా ఏర్పడింది. జనాభా ప్రాతిపదికన మహదేవ్ పూర్ మండలానికి 9 ఎంపీటీసీ స్థా నాలు వెళ్లాయి . పలిమెలకు రెండు ఎంపీటీసీ స్థా నాలే ఉన్నాయి . అదే, ఎంపీపీ ఎన్నికను కష్టం చేశాయి.