
కురవి, వెలుగు: కురవి భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి కల్యాణం భారీగా తరలివచ్చిన భక్తజనం నడుమ కన్నుల పండువగా కొనసాగింది. స్వామి వారు ఆలయంలో ఉదయం నుంచి కల్యాణ గడియల వరకు భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలతో శివనామస్మరణతో ఆలయ పరిసర ప్రాంతాలు మార్మోగాయి. శుక్రవారం రాత్రి కురవిలో గ్రామ సేవ , ఎదుర్కోలు నిర్వహించిన అనంతరం తెల్లవారుజామున ఒకటిన్నర గంటలకు స్వామి కల్యాణం జరిగింది.
కల్యాణ మహోత్సవానికి ఆలయ చైర్మన్ కొర్ని రవీందర్ రెడ్డి, మహబూబాబాద్ రూరల్ సీఐ సరవయ్య,ఈవో సత్యనారాయణ దంపతులు, అంబటి వీరభద్రం, ఎర్ర నాగేశ్వరరావు, వద్దుల సురేందర్ రెడ్డి పట్టు వస్త్రాలు, తలంబ్రాలను అందజేశారు. జాతరలో ఎలాంటి ఘటనలు జరగకుండా తొర్రూర్ డీఎస్పీ కృష్ణ కిశోర్, రూరల్ సీఐ సరవయ్య ఆధ్వర్యంలో బందోబస్తు కొనసాగించారు.