సూపర్ స్టార్ మహేశ్‌బాబు(Mahesh Babu) హీరోగా వస్తున్న తాజా చిత్రం గుంటూరుకారం. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో లేటెస్ట్ బ్యూటీ శ్రీలీల, మీనాక్షీ చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సుర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ మూవీ జనవరి 12న ప్రేక్షకులు ముందుకు రానుంది. ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఈ చిత్రంలో నుండి కుర్చీని మడతపెట్టి అనే మాస్ సాంగ్ విడుదల చేశారు మేకర్స్.
అవుట్ అండ్ అవుట్ మాస్ బీట్ తో వచ్చిన ఈ పాట ఆడియన్స్ ను తెగ ఆకట్టుకుంటోంది. ఇక పాటలో మహేష్, శ్రీలీల వేసిన స్టెప్స్ కి ఫ్యాన్స్ ఊగిపోతున్నారు. అంతేకాదు.. జనవరి 12న థియేటర్స్ లో మాస్ జాతర కన్ఫర్మ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరు కూడా ఆ సాంగ్ చూసి ఎలా ఉందొ కామెంట్ చేయండి.