ఎంపీ ఎన్నికల్లో ఓటమిపై కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పోస్ట్‌‌‌‌‌‌‌‌మార్టం

ఎంపీ ఎన్నికల్లో ఓటమిపై  కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పోస్ట్‌‌‌‌‌‌‌‌మార్టం
  • నేడు గాంధీ భవన్‌‌‌‌‌‌‌‌లో ముఖ్య నేతలతో కురియన్‌‌‌‌‌‌‌‌ కమిటీ భేటీ
  • హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు చేరుకున్న త్రీమెన్ కమిటీ

హైదరాబాద్, వెలుగు: లోక్‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఓటమిపై కాంగ్రెస్​ హైకమాండ్ పోస్టుమార్టం చేసేందుకు సిద్ధమైంది. దీంతో ఏఐసీసీ నియమించిన త్రీమెన్ కమిటీ బుధవారం రాత్రి రాష్ట్రానికి చేరుకుంది. కాంగ్రెస్ సీనియర్ నేత పీజే కురియన్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ కమిటీలో రఖ్బుల్ హుస్సేన్, పర్గత్ సింగ్‌‌‌‌‌‌‌‌ సభ్యులుగా ఉన్నారు.

కమిటీ సభ్యులకు శంషాబాద్ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌లో ఏఐసీసీ ప్రోటోకాల్ కమిటీ చైర్మన్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కార వేణుగోపాల్ రావు స్వాగతం పలికారు. ఈ క్రమంలో గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు గాంధీ భవన్‌‌‌‌‌‌‌‌లో అన్ని లోక్‌‌‌‌‌‌‌‌సభ నియోజకవర్గాలకు చెందిన పార్టీ ముఖ్య నేతలతో త్రీమెన్ కమిటీ భేటీ కానుంది. లోక్‌‌‌‌‌‌‌‌సభ నియోజకవర్గాల వారీగా సాగనున్న ఈ సమావేశంలో గెలిచిన ఎంపీలు, ఓడిన అభ్యర్థులు, ఎన్నికల ఇన్‌‌‌‌‌‌‌‌చార్జిలుగా ఉన్న రాష్ట్ర మంత్రులు, ఆయా లోక్‌‌‌‌‌‌‌‌సభ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొననున్నారు.  

ఓటమికి రీజన్స్‌‌‌‌‌‌‌‌ ఏంటి?

లోక్‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లు టార్గెట్‌‌‌‌‌‌‌‌గా ఎన్నికల బరిలోకి దిగిన కాంగ్రెస్.. కేవలం 8 సీట్లలోనే గెలిచింది. పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఇంత తక్కువ సీట్లు రావడం హైకమాండ్‌‌‌‌‌‌‌‌ను ఆందోళనకు గురిచేసింది. దేశంలోని మరికొన్ని రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌కు ఇలాంటి ఎదురుదెబ్బలే తగలడంతో వాస్తవాలను తెలుసుకునేందకు ఏఐసీసీ ఆయా రాష్ట్రాలకు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలను నియమించింది. ఇందులో భాగంగానే ఈ కమిటీ  తెలంగాణలో పార్టీ ఓటమికి గల కారణాలపై పోస్టుమార్టం చేయనుంది. పార్టీ ఓటమికి గల కారణాలు ఏమిటి? అనే విషయాలపై ఈ కమిటీ ఆరా తీసి, అధిష్టానానికి నివేదిక ఇవ్వనుంది.