![కర్నూలు జిల్లా టీడీపీలో భగ్గుమన్న విభేదాలు](https://static.v6velugu.com/uploads/2019/03/84189ea1bcd524adae0d1297515c1632.jpg)
కర్నూలు జిల్లా కొడుమూరు తెలుగుదేశం పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి. కర్నూల్ మండలం దేవమడ గ్రామంలో అలంపూర్ మాజీ MLA కొత్తకోట ప్రకాష్ రెడ్డి వాహనంపై ఎదురూరు విష్ణు వర్ధన్ రెడ్డి వర్గీయులు రాళ్లతో దాడి చేశారు. పరస్పరం ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో కొందరికి గాయాలయ్యాయి. ఉద్రిక్తతల సమాచారంతో.. పోలీసులు ఆ ప్రాంతానికి పెద్దసంఖ్యలో చేరుకున్నారు. కొందరిని అదుపులోకి తీసుకున్నారు. రెండు వర్గాలు… కర్నూలు మండలం పోలీసులకు కంప్లయింట్లు చేశాయి.
![](http://www.v6velugu.com/wp-content/uploads/2019/03/7165f202-4ac6-4c02-9001-0a44479ce9b7-1024x576.jpg)