మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణుకు తుది వీడ్కోలు

మిర్యాలగూడ, వెలుగు: ఈనెల 26న గుండెపోటుతో మృతి చెందిన మిర్యాలగూడ మున్సిపాలిటీ వైస్ చైర్మన్  కుర్ర  విష్ణు(కోటేశ్వరరావు)(52)కు కార్యకర్తలు తుడి వీడ్కోలు పలికారు. గురువారం కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు.

 అంతకుముందు పట్టణంలోని బంగారుగడ్డలోని ఆయన నివాసంలో పార్థివ దేహాన్ని ఉంచగా.. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు, మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ పూలమాలలు వేసి నివాళి అర్పించారు.  అనంతరం 21వ వార్డు బాపూజీ నగర్ శ్మశాన వాటిక వరకు అంతిమ యాత్ర నిర్వహించి అంత్యక్రియలు పూర్తిచేశారు.