![కనుచూపు మేర.. కురుమూర్తి జాతర](https://static.v6velugu.com/uploads/2022/11/Kurumurthy-Jatara_yxL4u8lmsi.jpg)
మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్ సమీపంలో కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. జాతరలో ప్రధాన ఘట్టమైన ఉద్దాల(పాదుకలు) ఉత్సవం సోమవారం కనుల పండువగా సాగింది. ఉదయం పళ్లమర్రి గ్రామం నుంచి ఉద్దాల చాటను నెలికొండి మీదుగా వడ్డేమాన్ గ్రామానికి ఊరేగింపుగా తీసుకొచ్చారు. మధ్యాహ్నం అక్కడి మండపంలో తయారు చేసిన ఉద్దాలను చాటలో ఉంచి ప్రత్యేకంగా పూజించారు.
అనంతరం ఉద్దాల చాటను గ్రామం నుంచి ఊరేగింపుగా ఈక చెట్టు వాగు మీదుగా తిర్మలాపూర్లోని ఆంజనేయ స్వామి ఆలయానికి తీసుకెళ్తుండగా ఉద్దాల చాటను తాకేందుకు భక్తులు పోటీ పడ్డారు. ఉద్దాల చాటను కురుమూర్తిలోని ఆలయ ముఖద్వారం వద్ద ప్రత్యేక పూజలు చేసి మండలంలో ప్రతిష్ఠించారు. ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి లక్ష మందికి పైగా భక్తులు తరలివచ్చారు.
- వెలుగు, మహబూబ్నగర్