
రంగారెడ్డి జిల్లాలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. శంకర్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని రైల్వే పట్టాలపై యువకుడు సూసైడ్ కు పాల్పడ్డాడు. యువకుడి ఆత్మహత్యకు ప్రేమ విఫలం కావడమే కారణం. ఈ మేరకు మృతుడు సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
వికారాబాద్ జిల్లా తాండూర్ మండలం అల్లాపూర్ గ్రామానికి చెందిన కురువ మహేష్(21) హైదరాబాద్ నగరంలో నల్లా మల్లారెడ్డి కాలేజీలో అగ్రికల్చర్ బీఎస్సీ చదువుతున్నాడు. అతను ఓ యువతిని ప్రేమించినట్లు తెలుస్తోంది. ప్రియురాలు మోసం చేసిందని..అందుకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని మహేష్ సెల్ఫీ వీడియో తీశాడు. తల్లిదండ్రులను క్షమించాలని చెప్పిన అతను..తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని అన్నను కోరాడు. ఆ తర్వాత రైలు పట్టాలపై తలపెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు..మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.