Cricket World Cup 2023: తప్పు నాదే.. కోహ్లీ విషయంలో అలా మాట్లాడకుండా ఉండాల్సింది: శ్రీలంక కెప్టెన్

Cricket World Cup 2023: తప్పు నాదే.. కోహ్లీ విషయంలో అలా మాట్లాడకుండా ఉండాల్సింది: శ్రీలంక కెప్టెన్

వరల్డ్ కప్ లో శ్రీలంక కెప్టెన్ కుశాల్ మెండిస్ కోహ్లీ విషయంలో సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.  బంగ్లాదేశ్ తో మ్యాచ్ కు ముందు ప్రెస్ మీట్ లో కోహ్లీ 49 వ సెంచరీ గురించి అడుగుతూ.. మీరు అతన్ని అభినదించాలనుకుంటున్నారా ? అని అడిగారు. దీనికి మెండీస్ స్పందిస్తూ కోహ్లీని నేనెందుకు అభినందించాలి అని చెప్పడం వైరల్ గా మారింది. అయితే తాజాగా దీనిపై శ్రీలంక కెప్టెన్ ఈ విషయంపై వివరణ ఇస్తూ కోహ్లీ గురించి సానుకూలంగా స్పందించాడు. 

మెండిస్ మాట్లాడుతూ " కోహ్లి వన్డేల్లో 49వ సెంచరీని సాధించాడని నాకు తెలియదు. జర్నలిస్ట్ అకస్మాత్తుగా అడగడంతో నాకు ఏం చెప్పాలో అర్ధం కాలేదు. నిజం చెప్పాలంటే నాకు ప్రశ్న కూడా సరిగా అర్ధం కాలేదు. 49 సెంచరీలు కొట్టడం సాధారణమైన విషయం  కాదు. కోహ్లీకి శుభాకాంక్షలు చెప్పకపోవడం బాధగా ఉంది. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ రికార్డ్ బ్రేక్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. రానున్న రోజుల్లో కోహ్లీ మరిన్ని రికార్డులు బ్రేక్ చేస్తాడని ఆశిస్తున్నా" అని మెండీస్ చెప్పుకొచ్చాడు.
 
ఈ వరల్డ్ కప్ లో దక్షిణాఫ్రికాపై నవంబర్ 5 న కోల్ కత్తా ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన మ్యాచ్ లో  కోహ్లీ వన్డేల్లో 49 సెంచరీలు పూర్తి చేసుకున్నాడు. తన పుట్టిన రోజున సచిన్ టెండూల్కర్ అత్యధిక సెంచరీల రికార్డ్ సమం చేయడంతో ఈ సెంచరీ ఎంతో స్పెషల్ గా మారింది. మరో సెంచరీ చేస్తే వన్డేల్లో 50 సెంచరీలు చేసిన తొలి ప్లేయర్ గా కోహ్లీ చరిత్ర సృష్టిస్తాడు.