వన్డే ప్రపంచ కప్ ఓటముల ఎఫెక్ట్.. మూడు ఫార్మాట్ల‌కు ముగ్గురు కెప్టెన్లు

వన్డే ప్రపంచ కప్ ఓటముల ఎఫెక్ట్.. మూడు ఫార్మాట్ల‌కు ముగ్గురు కెప్టెన్లు

భారత్ వేదికగా జరిగిన వ‌న్డే ప్రపంచ క‌ప్‌లో లంకేయులు పేలవ ప్రదర్శన కనబరిచిన విషయం తెలిసిందే. 9 మ్యాచ్‌ల్లో కేవలం రెండింట విజయం సాధించి లీగ్ దశలోనే నిష్రమించారు. ఈ ప్రదర్శన అనంతరం లంక క్రికెట్‌లో అనేక పరిమాణాలు చోటుచేసుకున్నాయి. లంక క్రికెట్ పాలకమండలిని ఆ దేశ పార్లమెంట్ రద్దుచేయటం, దీంతో రాజకీయ జోక్యమని లంక బోర్డును ఐసీసీ సస్పెండ్ చేయడం.. లంక క్రికెట్‌కు ఈ గతి పట్టడానికి బీసీసీఐ సెక్రటరీ జై షా కారణమని ఆ దేశ మాజీ క్రికెటర్ అర్జున రణతుంగ వ్యాఖ్యానించటం వంటి అనూహ్య పరిమాణాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆ దేశ‌ క్రికెట్ బోర్డు మేల్కొంది. 

ఏదేని టోర్నమెంట్‌లో లంక జట్టుకు వైఫల్యాలు ఎదురైనా.. ఆ ప్రభావం బోర్డుపై పడకుండా ఉండేలా చర్యలు తీసుకుంది. వేరు వేరు ఫార్మాట్లకు వేరు వేరు కెప్టెన్లను నియమించింది. స్వ‌దేశంలో జింబాబ్వేతో జరగనున్న వ‌న్డే, టీ20 సిరీస్ కోసం కొత్త కెప్టెన్ల‌ను ప్రకటించింది. ప్ర‌పంచ‌క‌ప్‌లో తీవ్రంగా నిరాశ‌ప‌రిచిన‌ వ‌న్డే కెప్టెన్ ద‌సున్ శ‌న‌క‌పై వేటు వేస్తూ.. కుశాల్ మెండిస్‌కు ఆ బాధ్యతలు అప్ప‌గించింది. ఇక మిస్ట‌రీ స్పిన్న‌ర్ వ‌నిందు హ‌స‌రంగను టీ20 కెప్టెన్‌గా నియమించింది. దీంతో దిముత్ క‌రుణ‌ర‌త్నేటెస్టు సార‌థిగా ప‌రిమితం కానున్నాడు.

వ‌న్డే జట్టు: కుశాల్ మెండిస్(కెప్టెన్), చరిత అస‌లంక‌(వైస్ కెప్టెన్), ప‌తుమ్ నిస్సంక‌, స‌దీర స‌మ‌ర‌విక్ర‌మ‌, అవిష్క ఫెర్నాండో, స‌హ‌న్ అరాచిగో, నువ‌నిందు ఫెర్నాడో, ద‌సున్ శ‌న‌క‌, క‌మిందు మెండిస్, జ‌నిత్ లియ‌న‌గె, చ‌మిక క‌రుణ‌ర‌త్నే, వనిందు హ‌స‌రంగ‌, మహీష థీక్ష‌ణ‌, దిల్షాన్ మ‌ధుష‌న‌క‌, దుష్మంత  చ‌మీర‌, వెల్ల‌లాగే, ప్ర‌మోద్ మ‌ధుషాన్, అసిత ఫెర్నాండో, అకిల ధ‌నంజ‌య‌, జెఫ్రీ వండ‌ర్సే, చ‌మిక గుణ‌శేఖ‌ర‌.

టీ20 జట్టు: వ‌నిందు హ‌స‌రంగ‌(కెప్టెన్), చరిత అస‌లంక (వైస్ కెప్టెన్), ప‌తుమ్ నిస్సంక‌, కుశాల్ మెండిస్, శ‌న‌క‌, మాథ్యూస్, డిసిల్వా, థీక్ష‌ణ‌, పెరీర‌, రాజ‌ప‌క్సే, క‌మిందు మెండిస్, వెల్ల‌లాగే,  అకిల ధ‌నంజ‌య‌, వాండ‌ర్సే, క‌రుణ‌ర‌త్నే, దుష్మంత చ‌మీర‌, మ‌ధుష‌న‌క‌, ఫెర్నాండో, తుషార‌, మ‌ధుషాన్, ప‌థిర‌న‌.

శ్రీలంక‌, జింబాబ్వే మ‌ధ్య మూడు వ‌న్డేల సిరీస్ జ‌న‌వ‌రి 6 నుంచి మొదలుకానుంది. ఇది ముగిసిన అనంతరం జ‌న‌వ‌రి 14 నుంచి మూడు మ్యాచ్‌ల‌ టీ20ల సిరీస్ జరగనుంది. వన్డే మ్యాచ్‌లు మధ్యాహ్నం 2:30 గంటలకు, టీ20 మ్యాచ్ లు రాత్రి 7:00 గంటలకు ప్రారంభమవుతాయి.

శ్రీలంక‌, జింబాబ్వే వన్డే, టీ20 సిరీస్ షెడ్యూల్

  • మొదటి వన్డే (జనవరి 06): ఆర్.ప్రేమదాస స్టేడియం (కొలంబో)
  • రెండో వన్డే (జనవరి 08): ఆర్.ప్రేమదాస స్టేడియం (కొలంబో)
  • మూడో వన్డే (జనవరి 11): ఆర్.ప్రేమదాస స్టేడియం (కొలంబో)
  • మొదటి టీ20(జనవరి 14): ఆర్.ప్రేమదాస స్టేడియం (కొలంబో)
  • రెండో టీ20 (జనవరి 16): ఆర్.ప్రేమదాస స్టేడియం (కొలంబో)
  • మూడో టీ20 (జనవరి 18): ఆర్.ప్రేమదాస స్టేడియం (కొలంబో)