కుశాల్ పెరీరా రికార్డు సెంచరీ..మూడో టీ20లో కివీస్‌‌‌‌‌‌‌‌పై లంక గెలుపు

కుశాల్ పెరీరా రికార్డు సెంచరీ..మూడో టీ20లో కివీస్‌‌‌‌‌‌‌‌పై లంక గెలుపు

నెల్సన్ (న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌) :  కుశాల్‌‌‌‌‌‌‌‌ పెరీరా (101) తమ దేశం తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ (44 బాల్స్‌‌‌‌‌‌‌‌లో)తో రికార్డు సృష్టించడంతో న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌తో గురువారం జరిగిన మూడో టీ20లో శ్రీలంక 7 రన్స్ తేడాతో గెలిచి  ఊరట దక్కించుకుంది.  మొదట బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌ చేసిన  ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 218/5  స్కోరు చేసింది. పెరీరాతో పాటు కెప్టెన్ చరిత్ అసలంక (46)  రాణించాడు.

అనంతరం ఛేజింగ్‌‌‌‌‌‌‌‌లో ఆతిథ్య కివీస్ ఓవర్లన్నీ ఆడి 211/7 స్కోరు మాత్రమే చేసి ఓడింది. రచిన్ రవీంద్ర (69), టిమ్ రాబిన్సన్ (37), డారిల్ మిచెల్ (35) పోరాడినా ఫలితం లేకపోయింది. తొలి రెండు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో నెగ్గిన కివీస్ 2–1తో సిరీస్ కైవసం చేసుకుంది. కుశాల్ పెరీరాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌‌‌‌‌‌‌‌, జాకబ్‌‌‌‌‌‌‌‌ డఫీకి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు లభించాయి.