ఇలాంటి పనికి మాలిన వార్తలు రోజూ చదువుతాను : బోల్డ్ గా చెప్పిన బ్యూటీ

టాలీవుడ్,బాలీవుడ్ కి సంబంధించి ఏ హీరోయిన్ అయినా తన భర్తతో విడాకులు తీసుకున్న వెంటనే గాసిప్స్ స్టార్ట్ అవుతాయి. లేటెస్ట్గా బాలీవుడ్ యాక్టర్స్ కుషా కపిలా(Kusha Kapila) తన భర్త  జోరావర్ అహ్లువాలియా నుంచి విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. 

ఇక ఏముందీ సోషల్ మీడియాలో హీరోయిన్ కుషా కపిలా బాలీవుడ్ యాక్టర్ అర్జున్ కపూర్‌(Arjun Kapoor)తో డేటింగ్ చేస్తున్నట్టు పుకార్లు జోరందుకున్నాయి. దీంతో ఇదే విషయంపై కుషా కపిలా తన ఇంస్టాగ్రామ్ లో రియాక్ట్ అవుతూ..ప్రతిరోజూ నేను నా గురించి ఇలాంటి అర్ధంలేని మాటలు వింటున్నాను..ఇలాంటి పనికి మాలిన వార్తలు రోజూ చదువుతాను.. కానీ ఇవన్నీ పట్టించుకోను అంటూ తేల్చి చెప్పేసింది. అలాగే ప్రసెంట్, నన్ను నేను ఇండస్ట్రీ లో ప్రూవ్ చేసుకోవాలి. అందుకు నేను చాలా బిజీగా ఉన్నాను. ఇలాంటి రూమర్స్ను టచ్ చేసేంత ఫ్రీగా లేనంటూ ఖండించింది. 

రీసెంట్గా హీరో అర్జున్ కపూర్,మలైకా అరోరా( Malaika Arora) విడిపోయారని గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఎందుకంటే, మలైకా అరోరా రీసెంట్గా ముంబైలోని ఓ ఐ క్లినిక్ని విజిట్ చేయడానికి వెళ్ళింది. అక్కడ తాను వేసుకున్నస్వేట్ షర్ట్ పై Lets Fall Apart అని రాసి ఉంది.అంటే తెలుగులో విడిపోదాం..అని అర్థం.ఇక మలైకా టీ షర్ట్ పై విడిపోదాం అని మీనింగ్ ఉండడంతో అర్జున్ కపూర్ తో బ్రేకప్ అయినట్లు సోషల్ మీడియాలో గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఇక కుషా కపిలాతో అర్జున్ కపూర్ డేటింగ్ పుకార్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.