
మల్కాజ్గిరి, వెలుగు : ఓ కేసును క్లోజ్ చేసేందుకు రూ.3 లక్షలు లంచం డిమాండ్ చేసిన కుషాయిగూడ సీఐ, ఎస్ఐని ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారితో పాటు మధ్యవర్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కుషాయిగూడ ప్రాంతానికి చెందిన సింగిరెడ్డి భరత్‌రెడ్డిపై ఓ భూమి వివాదంలో కుషాయిగూడ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా పలుమార్లు భరత్‌రెడ్డిని కుషాయిగూడ సీఐ వీరస్వామి, ఎస్ఐ షేక్‌షఫీ స్టేషన్‌కు పిలిచి విచారించారు. అయితే, కేసును మూసివేసి సెటిల్ చేయాలని సీఐని భరత్‌రెడ్డి కోరగా.. అందుకు రూ.3 లక్షలు ఇవ్వాలని సీఐ డిమాండ్‌చేశారు.
ఆ డబ్బులు ఉపేందర్ అనే మధ్యవర్తికి ఇవ్వాలని సూచించారు. డబ్బులు ఇచ్చేందుకు అంగీకరించిన భరత్‌రెడ్డి.. రంగారెడ్డి జిల్లా యూనిట్ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు శుక్రవారం భరత్ రెడ్డి కుషాయిగూడలోని ఓ హోటల్ లో ఉపేందర్‌కు డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రూ.3 లక్షలు స్వాధీనం చేసుకొని, ఉపేందర్‌తో పాటు సీఐ వీరస్వామి, ఎస్ఐ షేక్షఫీని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.