కుషాయిగూడలోని టెంపుల్లో చోరీకి యత్నించిన దొంగ.. వాచ్ మెన్ దాడిలో అక్కడిక్కడమే మృతి చెందాడు. మంగళవారం రాత్రి 2.38 గంటలకు కుషాయిగూడలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో దుండగుడు చోరీకి యత్నించాడు. హుండీ పగుల కొట్టి చోరీ చేస్తుండగా గమనించిన వాచ్ మెన్ దొంగపై దాడి చేశాడు. రాళ్లతో దొంగ ఎదురుదాడి చేయడంతో వాచ్ మెన్ కర్రతో కొట్టాడు. ఈ దాడిలో తలకు తీవ్ర గాయం కావడంతో దొంగ అక్కడిక్కడే మృతి చెందాడు. జేబులో దొరికిన సెల్‌ఫోన్ ఆధారంగా చోరీకి యత్నించింది గండం రాజు (23)గా గుర్తించారు.. అతడి స్వస్థలం కామారెడ్డి జిల్లా ఆరేపల్లి అని తెలిసింది. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని కుషాయిగూడ సీఐ వెంకటేశ్వర్లు చెప్పారు.