న్యూ లుక్ తో అదరగొట్టిన ఖుష్బూ .. 

న్యూ లుక్ తో అదరగొట్టిన ఖుష్బూ .. 

సోషల్ మీడియా ట్రోలింగ్‌‌‌‌‌‌‌‌పై ఇటీవల త్రిష ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.  తాజాగా నటి ఖుష్బూ కూడా ట్రోలర్స్‌‌‌‌‌‌‌‌ తీరుపై ఫైర్ అయ్యారు.  తన న్యూ లుక్‌‌‌‌‌‌‌‌ ఫొటోస్‌‌‌‌‌‌‌‌ను ఆమె సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.  ‘బ్యాక్ టు ద ఫ్యూచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ అంటూ షేర్ చేసిన ఈ ఫొటోస్‌‌‌‌‌‌‌‌లో ఆమె చాలా సన్నగా కనిపించారు.

ఇలా ఆమె నాజూగ్గా మారిన తీరుపై కొందరు నెటిజన్స్‌‌‌‌‌‌‌‌ ప్రశంసలు కురిపించారు. అయితే మరికొందరు మాత్రం ఇంజెక్షన్స్‌‌ వల్లే తను ఇలా మారిపోయిందని, వాటి గురించి ఫాలోవర్స్‌‌‌‌‌‌‌‌కు కూడా చెప్పొచ్చు కదా అంటూ ఆమెను ట్రోల్ చేశారు. 

ఈ కామెంట్స్‌‌‌‌‌‌‌‌పై అసహనం వ్యక్తం చేసిన ఖుష్బూ వారికి గట్టి కౌంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చారు. ‘మీరు ఎలాంటి మనుషులు.. మీరెప్పుడూ మీ ముఖాలను సోషల్ మీడియాలో పంచుకోరు.. ఎందుకంటే మీరు అంత అసహ్యంగా ఉంటారు.  మీ పేరెంట్స్‌‌‌‌‌‌‌‌ను చూస్తుంటే జాలేస్తోంది’ అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వైపు తమిళ చిత్రాలతో పాటు టీవీ షోస్‌‌‌‌‌‌‌‌,  సీరియల్స్‌‌‌‌‌‌‌‌తో ఆమె బిజీగా ఉన్నారు.