డ్రగ్స్ విషయంలో పోలీసుల తీరు సరికాదు

హైదరాబాద్: డ్రగ్స్ విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరు సరికాదని షార్ట్ ఫిలిం నటి కల్లపు కుషితా ఆరోపించారు. డ్రగ్స్ విషయంలో అందరిని బాధ్యులను చేయడం, పోలీస్ స్టేషన్ తీసుకెళ్లడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. లేట్ అవర్స్ పబ్ లో ఉండటం తమ తప్పు కాదని, పబ్ లో డ్రగ్స్ వినియోగిస్తున్న విషయం తమకు తెలియదన్నారు. పార్టీ అయ్యాక బయటకి వెళదామనుకునే లోపే పోలీసులు వచ్చారని తెలిపారు. అందరి రక్త నమూనాలు తీసుకొని.. డ్రగ్స్ తీసుకున్న వారి పై చట్టరీత్య చర్యలు తీసుకోవాలన్నారు. తప్పుడు ప్రచారం వల్ల తమ కుటుంబ సభ్యులు మానసికంగా కృంగిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తల కోసం..

బెయిల్ రద్దు చేయాలని సిట్ చెప్పినా ఎందుకు చేయలే?

మిర్చి నాణ్యత పరీక్ష కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి పువ్వాడ

వడ్లు కొనకుంటే బీజేపీకి నూకలు చెల్లినట్టే