మునుగోడులో పోలింగ్ సజావుగా కొనసాగుతోంది. నారాయణపూర్ మండలం లింగవారిగూడెంలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు చాలా కీలకమన్న కూసుకుంట్ల ప్రజలంతా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
కొంతమంది కావాలనే డ్రామాలు చేస్తున్నారని కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు. బీజేపీ నేతలు బైపోల్ను రద్దు చేయించే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ ఎక్కడ కూడా డబ్బులు పంపిణీ చేయలేదని స్పష్టం చేశారు. డబ్బుల పంపిణీపై కావాలనే తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.