కమ్యూనిస్టులు గెలవరనే నాకు టికెట్ : కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

  • మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

మునుగోడు, వెలుగు : కమ్యూనిస్టులకు టికెట్‌ ఇస్తే గెలిచే పరిస్థితి లేకపోవడంతోనే  సీఎం కేసీఆర్ తనకు ఇచ్చారని  ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు.  గురువారం దివ్యాంగులకు పెంచిన పెన్షన్ పత్రాలను అందించి మాట్లాడారు. సీఎం కేసీఆర్‌‌ నిర్ణయంతో కమ్యూనిస్టుల గుండెల్లో రాయి పడ్డదని, బీఆర్‌‌ఎస్‌తోనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమన్నారు.

నియోజకవర్గంలో ఫ్లోరోసిస్ కారణంగా దివ్యాంగుల సంఖ్య పెరగడాన్ని ఉద్యమంలోనే గుర్తించిన కేసీఆర్‌‌ అధికారంలోకి రాగానే నివారణకు చర్యలు చేపట్టారన్నారు.  మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు సరఫరా అవుతుండడంతో ఫ్లోరోసిన్ బాధ తప్పిందన్నారు.