
కొత్తగూడ, (గంగారం), వెలుగు : ఆదివాసీల ఆచార వ్యవహారాలను కాపాడుకోవాలని మంత్రి సీతక్క కోడలు, ములుగు నియోజకవర్గ లీడర్ కుసుమాంజలీ సూర్య అన్నారు. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం కామారంలో కల్తీ వంశీయుల ఇలవేల్పు అయిన గాదరాజు గుడి నిర్మాణ పనులను ఆదివారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆదివాసీల గొట్టు గోత్రాలను భవిష్యత్ తరానికి తెలియజేయాలన్నారు.
అనంతరం మడగూడలోని అల్లూరి సీతరామరాజు యూత్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్క్రీడలను ప్రారంభించి, క్రీడాకారులకు స్పోర్ట్స్కిట్లను అందించారు. కొత్తగూడ మండలంలోని పొగుళ్లపల్లిలో గంగమ్మ తల్లి జాతరలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మోకాళ్లపల్లిలో గృహ ప్రవేశం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆమెవెంట కాంగ్రెస్ పార్టీ గంగారం మండలాధ్యక్షుడు జాడీ వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీపీ సరోజన, మాజీ జడ్పీటీసీ రమ, కొత్తగూడ మండలాధ్యక్షుడు వజ్జ సారయ్య, బ్లాక్ కాంగ్రెస్అధ్యక్షుడు మొగిలి, మాజీ సర్పంచ్ మల్లెల రణధీర్ తదితరులు పాల్గొన్నారు.